Nitin Gadkari: ఏపీలో రూ. 1046 కోట్ల నిధులతో 18 ఫ్లైఓవర్ల నిర్మిస్తున్నాం..! 16 d ago
ఏపీలో జాతీయ రహదారులపై రూ.1046 కోట్ల నిధులతో చేపట్టిన 18ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. లోక్సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎన్ హెచ్216ఏపై కైకవరం వద్ద నిర్మిస్తున్న 5వంతెనలు 2025 ఏప్రిల్ నాటికీ పూర్తవుతాయని చెప్పారు. ఎన్ హెచ్16పై నెల్లూరు టీ జంక్షన్ల వద్ద నిర్మిస్తున్న 2వంతెనలు 2025 సెప్టెంబర్కి పూర్తవుతాయని వెల్లడించారు.